NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

20.84 లక్షలతో నిర్మించిన హెల్త్ క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గం  మద్దికేర మండలం బురజుల గ్రామంలో రూ 20.84 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ను స్థానిక ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ శనివారం ప్రారంభించారు. హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవంలో గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు,మండల అధికారులు, డాక్టర్లు, హెల్త్ క్లినిక్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అలాగే హోసూరు నుంచి మొలగవల్లి వెళ్ళే రహదారి పనులను ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ సంబంధిత కాంట్రాక్టర్ మరియు అధికారులతో కలసి పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న రహదారి పనులను త్వరలో పూర్తి చేసి ప్రజలకు వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హోసూరు గ్రామ వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author