PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉజ్బెకిస్థాన్‌లో రెండురోజుల పాటు హెల్త్ ఫోర‌మ్ 2023

1 min read

– స‌ద‌స్సులో పాల్గొన్న హైద‌రాబాద్, ఢిల్లీ, ముంబై, ఇతర రాష్ట్రాల ఆస్పత్రులు, ఔష‌ధ, వైద్య ఆయుష్ విద్యా సంస్థల ప్రతినిధులు
– వివ‌రాలు వెల్లడించిన ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్ దివ్య ఎస్‌. రాజ్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ తాష్కెంట్‌: ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ‌, భార‌త‌దేశం క‌లిసి సంయుక్తంగా ఉజ్బెకిస్థాన్ రాజ‌ధాని తాష్కెంట్‌లో రెండు రోజుల పాటు హెల్త్ ఫోర‌మ్ 2023 నిర్వహించాయి. భార‌త ఆరోగ్యశాఖ స‌హాయ మంత్రి డాక్టర్ భార‌తీ ప్రవీణ్ ప‌వార్‌, ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రి డాక్టర్ ఇన‌య‌టోవా, భారత ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ సందేశం, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి, ఇరు దేశాల దౌత్యవేత్తల‌తో పాటు.., భారత సంత‌తికి చెందిన డాక్టర్ దివ్య ఎస్. రాజ్‌రెడ్డి ఈ స‌ద‌స్సులో పాల్గొన్నారు. డాక్టర్ దివ్య ఎస్‌. రాజ్ రెడ్డిని ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇటీవ‌లే భార‌త‌దేశానికి త‌మ అధికార ప్రతినిధిగా నియ‌మించింది. హెల్త్ ఫోరమ్ 2023లో ప్రధానంగా భార‌తదేశంలో ప్రాచుర్యం పొందుతున్న ఆయుష్ వైద్యవిద్యను ఉజ్బెకిస్థాన్‌లోనూ ప్రవేశ‌పెట్టాల‌ని నిర్ణయించారు. ఇంకా, భార‌త‌దేశానికి.. అందునా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏఐజీ, య‌శోద‌, అపోలో, శ్రీ‌శ్రీ హోలిస్టిక్, రెయిన్‌బో, జీఎస్ఎల్‌.. ఇంకా ఢిల్లీ, ముంబైల‌కు చెందిన మేదాంత‌, ఫోర్టిస్‌, స‌ర్వోద‌య‌, ఆకాష్‌ లాంటి ఆస్పత్రుల‌తోపాటు హెటెరో, డాక్టర్ రెడ్డీస్, బ‌యోఫెర్న్ లాంటి ఫార్మా సంస్థల‌తో ఉబ్జెకిస్థాన్ ప్రభుత్వం, అక్కడి ఆరోగ్య మంత్రిత్వశాఖ‌, వైద్య సంస్థలు వంద‌కు పైగా ఎంఓయూలపై సంత‌కాలు చేసుకున్నారు. జీఎస్ఎల్ మెడిక‌ల్ కాలేజి, డాక్టర్ డీవై పాటిల్ కాలేజి, స‌బ‌మ‌త్, జేఎస్ఎస్‌ యూనివ‌ర్సిటీలు, కూడా ఈ ఎంఓయ‌లు చేసుకున్నవాటిలో ఉన్నాయి. ఈ సంద‌ర్భంగా నియో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ డైరెక్టర్ కూడా అయిన డాక్టర్ బి. దివ్య ఎస్.రాజ్‌రెడ్డి మాట్లాడుతూ, రెండు దేశాల‌కు మ‌ధ్య వైద్య రంగంలో ద్వైపాక్షిక సంబంధాలు చాలా మెరుగుప‌డుతున్నాయి. భార‌తీయ వైద్య, ఆయుష్ మంత్రులు, మేదాంత ఆస్పత్రి అధినేత‌, నియో ఇన్‌స్టిట్యూట్ ఎండీ త‌దిత‌రుల‌కు ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం నుంచి వైద్య రంగంలో వారు అందిస్తున్న సేవ‌ల‌కు గాను ప్రభుత్వ మెడల్స్ ల‌భించాయి. ఇప్పుడు భార‌త‌దేశానికి చెందిన ప‌లు (వైద్య విద్యా, ఫార్మా మరియు) ఆస్పత్రుల‌తో ఎంఓయూలు కుద‌ర‌డంతో ఉజ్బెకిస్థాన్‌ ( మరియు భారత దేశాల) లో వైద్యసేవ‌ల రంగం మ‌రింత పురోగ‌తి సాధిస్తుంద‌న్న విశ్వాసం క‌లిగింది. ఇరుదేశాల‌కు వార‌ధిగా ఉండేందుకు నాకు అందిన ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటాను అని చెప్పారు.(భారత దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీగారి పరిపాలనకు ఆకర్షతులై), వైద్య ప‌ర్యాట‌కం స‌హా అన్ని రంగాల్లో భార‌త‌దేశంతో స‌త్సంబంధాలు నెల‌కొల్పుకోవాల‌ని త‌మ దేశంలోని వైద్య మంత్రిత్వశాఖ‌ను ఉజ్బెకిస్థాన్ అధ్య‌క్షుడు షౌక‌త్ మిర్జియొయెవ్ ఆదేశించార‌ని నియో సంస్థ సీఈఓ డాక్ట‌ర్ బీవీకే రాజ్ తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తంలో త‌మ సంస్థకు చెందిన డాక్టర్ బి.దివ్య ఎస్.రాజ్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తుండ‌టం, భార‌త సంత‌తికి చెందిన ఆమెను ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం భార‌త‌దేశంలో త‌మ ప్రతినిధిగా నియ‌మించ‌డం ఎంతో సంతోష‌క‌ర‌మ‌ని చెప్పారు.

About Author