ఆరోగ్యమే మహాభాగ్యం… భావితరాలకు ఆరోగ్యం అందించండి..
1 min read– లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ సర్వీస్కో- ఆర్డినేటర్ చుక్క అవినాష్రాజు
– ఫాదర్ మ్యాచ్ కొల్లి పాల్గొని మందులు పంపిణీ చేశారు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : దెందులూరు నియోజకవర్గంపెదవేగి మండలం జానంపేట మరియపురం క్యాంపస్ నందు లైన్స్ ఇంటర్నేషనల్ విజన్ ఏలూరు లైన్స్ క్లబ్ లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ సర్వీస్ కోఆర్డినేటర్ చుకా అవినాష్ రాజు ఆధ్వర్యంలోఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరు ఆరోగ్యంగా జీవించాలని అన్నారు. ఆరోగ్యంతో ఉంటేఅన్నీ ఉన్నట్లేనని ఆయనతెలిపారు. ఏలూరు విజన్లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈఉచిత మెడికల్ క్యాంపు నునిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ క్యాంపులో విజయవాడకామినేని హాస్పిటల్, వంకాయగూడెం గుడ్ సెమ్ రిటన్హాస్పిటల్ ఏలూరు సూర్యహాస్పిటల్ నుండి వైద్యులుఅన్ని రకముల పరీక్షలునిర్వహించారు అన్నారు. వచ్చిన ప్రజలకు గుండె బిపి షుగర్ శస్త్ర చికిత్సలు గ్యాస్ ట్రబుల్ కీళ్ల నొప్పులు స్త్రీల వ్యాధులకుసంబంధించి సలహాలు మాతసంరక్షణపై అవగాహనతెలియజేయడం జరిగిందన్నారు.అవసరమైన వారికిమందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో కామినేనిహాస్పిటల్ షుగర్వ్యాధినిపుణులు డాక్టర్ కొడాలిరామ్ ప్రసీన్, బొర్రా మురళీకృష్ణహాస్పిటల్ గైనకాలజీనిపుణులు డాక్టర్ అనూష ,గుడ్ సామ్ రిటన్ హాస్పిటల్ జనరల్ వ్యాధి నిపుణులుచంద్ర, సూర్య హాస్పిటల్డాక్టర్ జి సాహితీ, సామి రెడ్డి, గుడ్ సామ్ రిటన్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ అక్బర్బాషా, సూర్య హాస్పిటల్ డాక్టర్ఆలీ, డాక్టర్ జి ఎస్ ప్రకాష్,ఫిజీషియన్క్రాంతి ప్రజలకువైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించడం జరిగిందన్నారు. ఈకార్యక్రమం లో ఫాదర్ మత్యస్ కొల్లి పాల్గొని మందులు పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.