అవినీతి ఆరోపణలతో ఆరోగ్యశాఖ మంత్రి తొలగింపు !
1 min readపల్లెవెలుగువెబ్ : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణలు రావడంతో మంత్రవర్గ సహచరుని పై భగవంత్ మాన్ వేటు వేశారు. ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లాను మంత్రి పదవి నుంచి తొలగించారు. మంత్రి అవినీతికి పాల్పడినట్టు బలమైన ఆధారాలు కనుగొనడంతో సీఎం ఈ చర్య తీసుకున్నారు. వివిధ కాంట్రాక్టులపై అధికారుల నుంచి 1 శాతం కమిషన్‌ను వసూలు చేసేవారని మంత్రిపై ఆరోపణలు వచ్చాయి. సింగ్లాపై వచ్చిన ఫిర్యాదులతో ఆయనను పదవి నుంచి తొలగించినట్టు మాన్ చెప్పారు. ఒక్క శాతం అవినీతిని కూడా తాము సహించేది లేదని అన్నారు. ప్రజలు ఎన్నో అంచనాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారని, ఆ అంచనాలను నిలబెట్టుకోవడం తమ బాధ్యతని ఆయన వివరించారు.