పోలీసులకు.. ఎస్పీఎఫ్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు
1 min readపల్లెవెలుగు వెబ్ ఓర్వకల్: విధి నిర్వహణలో పోలీసులకు తీవ్ర మానసిక ఒత్తిడితో హార్ట్ ఎటాక్ మరణాలు మరియు ఇతర అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని డిఐజి ఎస్పీఎఫ్ బి.వెంకట రామిరెడ్డి, ఎం. శంకర రావు, కమాండంట్, ఎస్పీఎఫ్, తిరుపతి వారీ ఆదేశాల మేరకు బుధవారం నాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ నందు ఎస్పీఎఫ్ సిబ్బందికి మెడికల్ క్యాంపు హుసేనాపురం పిహెచ్సి Dr. కె.అమర్నాథ్ రెడ్డి, సమక్షంలో వారి హాస్పిటల్ సిబ్బందితో పాటుగా ఓర్వకల్ పిహెచ్సి సిబ్బంది కూడా పాల్గొని ఎయిర్ పోర్ట్ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఎస్పీఎఫ్ సిబ్బందికి రక్త పరీక్షలు, బీపీ, సుగర్ & ఈసీజీ మొదలగు పరీక్షలు నిర్వహించారు. అసాధారణ స్థాయిలో బీపీ, షుగర్ లెవెల్స్ ఉన్న వారికి మెరుగైన పరీక్షల కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ వి. కృష్ఠయ్య సిబ్బంది పాల్గొన్నారు.