మానవ ప్రాణ శక్తి కేంద్రాల ప్రేరేపణ ద్వారా ఆరోగ్యం
1 min read
డాక్టర్ మాకాల సత్యనారాయణ
విజయవాడ , న్యూస్ నేడు : వైయస్సార్ తాడిగడప మునిసిపాలిటీ పరిధిలోని పోరంకి మూడో సచివాలయం దగ్గర మానవ ప్రాణ శక్తి కేంద్రాల పై అవగాహన మరియు యోగశక్తి చికిత్స కార్యక్రమం వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మున్సిపల్ కమిషనర్ భాను ప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగుల కోసం నిర్వహించారు. ఈ సదస్సుకు యోగ శక్తి సాధన సమితి విజయవాడ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని తాడిగడప మున్సిపల్ ఉద్యోగులకు చికిత్స మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కిరణ్ కుమార్ క్యాంప్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు.డాక్టర్ మాకాల సత్యనారాయణ శిక్షణ ఇస్తూ మాన దేహములోనే 500 జతల ప్రాణశక్తి కేంద్రాలు ఉన్నాయని వాటిని ప్రేరేపించడం ద్వారా ప్రాణశక్తిని పెంచుకోవడం వలన ఆరోగ్యం ఆనందం లభిస్తుందని,అందులో ముఖ్యమైనవి తెలియజేసి వాటిని ప్రేరేపించే విధానాన్ని ఉద్యోగులకు అలవాటు చేశారు.మన దేహంలో ఉన్న సహస్రారము, బ్రహ్మనాడి ముందు జుట్టు నుండి 7 వేళ్ళు వెనుకకు సెంటర్ లైన్ మీద ఉందని దానిని ప్రేరేపించడం ద్వారా శారీరక, మానసిక సమస్యలు తగ్గించుకోవచ్చు అని తెలిపారు. వెనుక జుట్టు నుండి క్రిందికి నాలుగు వేళ్ళు దూరంలో ఉన్న డి యు 14 శక్తి కేంద్రాన్ని చైతన్య పరచడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చని,అలాగే మెడ పక్కగా గల జిబి 21 కేంద్రాన్ని ప్రెషర్ ఇవ్వడం ద్వారా హార్మోన్స్ సమస్యలని బ్యాలెన్స్ చేయవచ్చు అని తెలిపారు.చెస్ట్ మీద స్టెర్నం బోన్ నుండి 3వేళ్ళు పైన ఉన్న ఆర్ ఈ ఎన్ 17 శక్తి కేంద్రాన్ని ప్రేరేపించడం ద్వారా ఊపిరితిత్తుల రిపేరు చేసుకోవచ్చని అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు అని తెలిపారు.ఇంకా ముఖ్యమైన నాడీ కేంద్రాల ఉపయోగం గురించి తెలియజేసి వాడుకోవటానికి మోడీ హెల్త్ కేర్ స్టిక్ ని ఉచితంగా అందరికీ అందించడం జరిగింది . వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మునిసిపల్ పరిధిలోని ప్రజలందరికీ సహజ ఆరోగ్య విధానాలని అలపర్చాలనే ఉద్దేశంతో ముందుగా ఉద్యోగులకు మన దేహంలోని ప్రాణ శక్తి కేంద్రాల పట్ల అవగాహన పెంచడం కోసం మరియు సహజ విధానాలతో చికిత్స విధానాలని ఎలా ఉంటాయో అలవర్చటం కోసం ఈ యోగ శక్తి సాధనా సమితి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మునిసిపల్ కమిషనర్ తెలియజేశారు ప్రజలకి ఆరోగ్యం అందిచాలని అనే దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించినట్లు చెప్పారు. డాక్టర్ మాకాల సత్యనారాయణ ఉద్యోగులు ప్రజల సమస్యలని ఈ ప్రాణ శక్తి విధానం ద్వారా ఎలా తగ్గించుకోవాలో చూపించి నేర్పించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ స్టాఫ్, ఆక్యుతెరపిస్టులు కొండవీటి సుమతి అసరా ఫున్నిసా తదితరులు పాల్గొన్నారు.