PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హెల్త్ వెల్నెస్ సెంటర్ తనిఖీ…

1 min read

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి — డాక్టర్. బి. రామగిడ్డయ్య

ఫ్యామిలి వైద్య విధానం తో ఇంటి ముందుటే వైద్య సేవలు

పల్లెవెలుగు వెబ్ కోడుమూరు: కోడుమూరు కో లోకేటెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కోడుమూరు నాలుగవ గ్రామ సచివాలయ పరిధిలో జరుగుతున్న కుటుంబ డాక్టర్ వైద్య విధానం  ప్రోగ్రాంను కర్నూలు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.రామ గిడ్డయ్య  గురువారం రోజు  01.02 .2024 వ తేదీన తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ .బి. రామగిడ్డయ్య గారు  మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా గ్రామంలలో ఉన్నటువంటి రక్తపోటు ,డయాబెటిస్, క్యాన్సర్ ,గుండెకు సంబంధించిన వ్యాధులకు గర్భిణీ స్త్రీలు, బాలింతలకు , చిన్నపిల్లలకు మరియు  బెడ్ పై ఉన్నటువంటి పేషెంట్లకు చికిత్స అందించడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ,అదేవిధంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించి ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి హాస్పిటల్స్ యందు చికిత్స పొందిన రోగులను తిరిగి పరిశీలించి వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొని తగు సూచనలు సలహాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు ఇవ్వడానికి ఎంతో దోహదపడుతుందని, కావున ఇటువంటి అమూల్యమైన విశిష్టత కలిగిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపినారు.అదేవిధంగా నూతనంగా నిర్మించి పూర్తిచేసిన కోడుమూరు ఐదవ  ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనాన్ని  తనిఖీ చేసి అక్కడ ఇంకా పెండింగ్లో ఉన్న నీటి సరఫరా మరియు విద్యుత్ కనెక్షన్ లను  కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చే అప్లై చేయించవలెనని వైద్యాధికారికి ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో  డాక్టర్. ఎస్.శ్రీమంత్ మాదన్న  కో లోకేటెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోడుమూరు వైద్యాధికారి 142 మంది సాధారణ వ్యాధిగ్రస్తులకు, 15 మంది గర్భిణీ స్త్రీలకు, 5 మంది బాలింతలకు,60మంది రక్తపోటు,25 మంది డయాబెటిస్ ,20  ఉన్నవారికి మరియు  బెడ్ పై ఉన్న ఒకరిని చికిత్స అందించి ఉచితంగా చికిత్స అందించి మాత్రలు పంపిణీ చేయడం జరిగినది.ఈ కార్యక్రమములో  శ్రీ .కె. నరసప్ప M.P.H.E.O, మరియు శ్రీ. కె. కమాల్ సాహెబ్ హెల్త్ సూపర్వైజర్ గార్లు ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలు అయినటువంటి కుటుంబ డాక్టర్ వైద్య విధానం, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు, కిషోర్ బాలికలకు రక్తహీనత నివారణకు ఐరన్ ఫోలిక్ ఆసిడ్ మాత్రల గురించి వారి ఆహార నియమాల గురించి,  ప్రధానమంత్రి వైద్య వందన యోజన ,జనని సుఖీభవ జనని శిశు సంరక్షణ కార్యక్రమం ,వ్యాధి నిరోధక టీకాలు ,డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా దోమల ద్వారా వ్యాప్తి చెందు మలేరియా ,డెంగ్యూ, చికెన్ గునియా జ్వరాల గురించి, క్షయ మరియు  కుష్టు వ్యాధుల  గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  కే నరసప్ప ఎం.పి.హెచ్.ఈ .ఓ,   శ్రీ.కే.కమాల్ సాహెబ్ హెల్త్ సూపర్వైజర్, ఎస్. లలిత జ్యోతి  కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, శ్రీమతి. ఏ .సుగుణమ్మ ఆరోగ్య కార్యకర్త , ఆశా కార్యకర్తలు  మరియు 104 సిబ్బంది పాల్గొన్నారు.

About Author