మంత్రి మేకపాటి గౌతమ్ కు గుండెపోటు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర విభాగంలో డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.