భారీగా పెరిగిన బంగారం
1 min readపల్లెవెలుగు వెబ్ : గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. గురువారం బంగారం ధర భారీగా పెరిగింది. ఒక్క రోజులోనే 300 రూపాయలు పెరిగింది. గత వారంలో రోజుల్లో 1500 పైగా బంగారం ధర పడిపోయింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్ లో బంగారం ధర 46500 ఉంది. బంగారం, వెండి ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీరేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి.