భారీగా పడిన టమోట ధర
1 min readపల్లెవెలుగువెబ్ : టమోటా ధరలు దారుణంగా పడిపోయాయి. వ్యాపారులు కిలో టమాట రూ.5లకు విక్రయిస్తున్నారు. దీంతో ఆరుగాలం కష్టపడి సాగుచేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరం పొలంలో టమాట ఒక్క కోతలో 100కుపైగా బాక్సుల దిగుబడి వస్తుంది. ఇందుకు ఐదుగురు కూలీలకు రూ.400ల చొప్పున రూ.2000, మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు ఒక్కొక్క బాక్సుకు రూ. 20 చొప్పున రూ.2000 ఖర్చు అవుతుంది. తైబజారు ఫీజు రూ.50 కలిపి రూ. 4050 అవుతోంది. వంద బాక్సులు అమ్మితే రూ.5000 వస్తుంది. వీటిని అమ్మి పెట్టినందుకు ఏజెంట్‌కు కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చేది కోత, రవాణాకే పోతే పెట్టుబడి సంగతి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.