శ్రీశైలానికి భారీ వరద !
1 min readపల్లెవెలుగువెబ్ : శ్రీశైలం ఎగువ పరీవాహక ప్రాంతం జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి బుధవారం ఇన్ఫ్లో భారీగా కొనసాగుతోంది. జూరాల జలాశయం నుంచి 1,05,822 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎమ్సీలు. ప్రాజెక్టులో బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి 826.90 అడుగుల వద్ద 46.5146 టీఎమ్సీలుగా నమోదయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో ఉత్పత్తి జరగడం లేదు.