పల్లెవెలుగు వెబ్:తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలకు ధాటికి చిగురుటాకులా వణుకుతోంది. జనజీవనం పూర్తీగా స్తంభించింది. చెన్నై నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. 17 గంటలుగా వర్షం కురుస్తోంది. తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో సాయంత్రం వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. చెన్నై సహా 20 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం రాత్రి వాయుగుండంగా మారింది. గురువారం సాయంత్రానికి మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు.