భారీ వర్ష సూచన !
1 min readపల్లెవెలుగువెబ్ : రుతుపవన ద్రోణి తూర్పుభాగం దక్షిణ ఒడిశా మీదుగా కొనసాగుతోంది. దీనికితోడు బంగాళాఖాతం నుంచి తేమగాలులు వీస్తున్నాయి. ఇదే సమయంలో పడమర తీరం నుంచి మధ్య, దక్షిణ భారతంపైకి తేమగాలులు వీయడంతో కోస్తాలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటన్నింటి ప్రభావంతో ఆదివారం కోస్తాలో అనేకచోట్ల ఉరుములతో వర్షాలు కురిశాయి. ఒకట్రెండుచోట్ల భారీవర్షాలు కురిశాయి. రానున్న 24గంటల్లో కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.