విచిత్ర వాతావరణంలో భారీ వర్షం. విరిగిపడిన భారీ చెట్లు..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల కేంద్రమైన గడివేముల గ్రామాలలో శనివారం సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం వల్ల చెట్లు విరిగిపడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది మండల వ్యాప్తంగా భారీ ఈదురుగాలులు మెరుపులు ఉరుములతో కూడిన వర్షం పడడంతో రైతులు మొక్కజొన్న పంట ఆర వేసుకున్న ప్రాంతంలో భారీగా నీరు నిలబడి పంట మొత్తం తడిసిపోయింది గత రెండు నెలల నుండి అకాల వర్షాల వల్ల పంట నష్టపోవడం రైతులకు నిత్యకృతంగా మారింది ఒకవైపు ఎండకాస్తు భారీ వర్షం పడడం విచిత్ర వాతావరణ నెలకొన్నడంతో గతంలో ఎన్నడు ఇటువంటి అకాల వర్షాలు పడలేదని రైతులు పేర్కొన్నారు మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం సోమవారం నుండి రైతు భరోసా కేంద్రాల ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేయడానికి సంసిద్ధమైన తరుణంలో అకాల వర్షాల వల్ల తడిసిన పంటకు మద్దతు ధర ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు విచిత్ర వాతావరణం నెలకొని ఒకవైపు ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది .