జిల్లా వ్యాప్థంగా భారీ వర్షాలు.. ప్రజలను అప్రమత్తం చేయాలి
1 min readజిల్లా ఎస్ పి హర్షవర్ధన్ రాజు ఐ పి ఎస్
పల్లెవెలుగు, వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి : జిల్లా వ్యాప్థంగా గతరెండురోజులుగా కురుస్థున్న వర్షాలకుచెరువులు, కుంటలు నిండి, గండి పడే అవకాశాలపై ముందస్తుగా క్షేత్ర స్థాయి పరిశీలన చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా ఎస్ పి హర్షవర్ధన్ రాజు ఐ పిఎస్ గారు పోలీస్ అధికారులను ఆదేశించారు.బుధవారం జిల్లాలోని పలు ప్రంతాలలొ ఆయన పర్యంతం చాలు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలన్నారు.జిల్లా వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపధ్యంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టి సహాయక చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచనలు చేశారు.జిల్లా ఎస్పీ శ్రీ.వి. హర్షవర్థన్ రాజు ఐపీఎస్.,ఆదేశాల మేరకుజిల్లాలో ఎడితెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై ప్రజలు ఇబ్బంది పడకుండా సహాయక చర్యలు చేపట్టారు.భారీ వర్షాలకు విద్యుత్ స్తంభాలు,చెట్లు రోడ్డుపై నేలకొరిగి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలగకుండా జిల్లా పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. అవసరమైన చోట తగిన బందోబస్తు ఏర్పాటుతో పాటు అత్యవసర సహయక బృందాలను అందుబాటులో ఉంచారు.వాగులు, వంకలు, వరద నీటిలో ప్రజలు చిక్కుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు.జిల్లాలో ఎక్కడైనా వాగులు, వంకలు పొంగిపొర్లితే ఆయా రహదారులపై ప్రజలు, వాహనాల రాకపోకలు కొనసాగకుండా బందోబస్తు, ఆయా ప్రాంతాలలో ప్రమాదకరమైన వాగు రహదారులను దాటేందుకు అనుమతించ కుండా జాగ్రతలు. వరద ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ఉధృతి తగ్గి సాధారణ పరిస్థితులు వచ్చేంత వరకు ఎవర్నీ అటు వైపుగా వెళ్లకుండా జాగ్రతలు. రెవెన్యూ, మున్సిపల్/గ్రామ పంచాయతీ అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు.పోలీస్ సిబ్బంది తక్షణ సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దు. తమ పరిసర ప్రాంతాలలో ఇల్లు, గోడలు కూలి పోవడం, చెట్లు నేల కొరకడం, విద్యుత్ స్తంభాలు మరియు తీగలు తెగి పోయిన చోట వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమాచారం తెలపాలని విజ్ఞప్తి. ప్రజలకు ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు డయల్ 100 నకు కాల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎ ఎస్పీ రాజ్ కమల్, డి ఎస్పీ శ్రీధర్ ,సి ఐ లు,ఎస్ ఐ లు పొలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.