NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆగ‌స్టు 25 వ‌ర‌కూ భారీ వ‌ర్షాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : దేశంలో ప‌లు రాష్ట్రాల్లో ఆగ‌స్టు 25 వ‌ర‌కు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ పేర్కొంది. బీహార్, తూర్పు ఉత్తర‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, స‌బ్ హిమాల‌య‌న్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాచ‌ల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో శ‌నివారం నుంచి ఈనెల 25 వ‌ర‌కు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ హెచ్చరించింది. హ‌ర్యానా, చంఢీఘ‌డ్, పంజాబ్, తూర్పు రాజ‌స్థాన్ లో నాలుగైదు రోజుల పాటు వ‌ర్షాలు కురుస్తాయ‌ని వెద‌ర్ బులెటిన్ లో ఐఎండీ పేర్కొంది. త‌మిళ‌నాడు, పుదుచ్చేరి, క‌రైక‌ల్, కేర‌ళ‌, మ‌హారాష్ట్ర, రాయ‌ల‌సీమ‌, కోస్టల్ ఆంధ్రా, యానంల‌లో మూడు రోజుల పాలు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ తెలిపింది.

About Author