ఉపఎన్నికలో భారీగా రిగ్గింగ్ : జీవిఎల్
1 min readపల్లెవెలుగు వెబ్: బద్వేల్ ఉపఎన్నికలో భారీ రిగ్గింగ్ జరిగిందని బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు ఆరోపించారు. వైకాపా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, వైకాపా ఆగడాలకు హద్దే లేకుండా పోయిందన్నారు. పోలీసులు కూడ వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారని అన్నారు. పక్క నియోజకవర్గాల ఓటర్లను అద్దెకు తీసుకొచ్చి ఓట్లు వేయించారని ఆరోపించారు. నిన్న జరిగిన పోలింగ్ లో కనీసం 50 నుంచి 60 వేలకు తగ్గకుండా దొంగ ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. ఎన్నికల్ని అపహాస్యం చేసేలా వైకాపా వ్యవహరించిందన్నారు. బద్వేలులోని 28 పోలింగ్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని అన్నారు. అక్రమాలు జరిగిన చోట రీపోలింగ్ నిర్వహించాలని ఈసీని కోరినట్టు జీవిఎల్ తెలిపారు.