NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారీగా త‌గ్గ‌నున్న స్టీల్, సిమెంట్ ధ‌ర‌లు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సిమెంట్‌ ధరలను భారీగా తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు శనివారం సాయంత్రం కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సిమెంట్ లభ్యతను మెరుగుపరచడంతోపాటు మెరుగైన లాజిస్టిక్స్ ద్వారా సిమెంట్ ధరను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే దిగుమతి ఆధారిత ఎక్కువగా ఉన్న.. ప్లాస్టిక్ ఉత్పత్తులకు ముడి పదార్థాలు మధ్యవర్తులపై కస్టమ్స్ సుంకాన్ని కూడా తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. మరోవైపు ఐరన్‌, స్టీల్‌పైనా.. సంబంధిత కొన్ని ముడి పదార్థాలపై దిగుమతి సుంకం తగ్గించినట్లు తెలిపారు. అయితే కొన్ని ఉక్కు ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధించబడుతుందని ఆమె స్పష్టం చేశారు.

                             

About Author