గడివేములలో భారీ వాహనాలు తిరిగితే ఉద్యమమే.. ప్రజా సంఘాలు
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: భారీ వాహనాల చక్రాల కింద పడి గడివేముల గ్రామంలో స్థానికులు చనిపోవడంతో శుక్రవారం నాడు ప్రజాసంఘాలు విద్యార్థి సంఘాలు సిపిఐ పార్టీ ముస్లిం మైనార్టీ కమిటీ ఆందోళన నిర్వహించారు అనుమతి లేకుండా డీజిల్ టోల్ గేట్ మిగిల్చుకోవడానికి అడ్డు అదుపు లేకుండా భారీ వాహనాలు తిరుగుతుండడంతో గడివేముల మండల వాసులు దుమ్ము ధూళి ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని కట్టడి చేయాల్సిన పోలీసులు అధికారులు స్పందించడం లేదని ప్రజా సంఘాలు ఆరోపించాయి గురువారం నాడు చెరుకుచర్ల గ్రామానికి చెందిన మహిళ లారీ చక్రాల కింద నలిగిపోవడంతో ప్రజా సంఘాలు సినిమా హాల్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి ఎస్సై బిటి వెంకటసుబ్బయ్యకు తాసిల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు సమస్యను శాశ్వతంగా పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమం తీవ్రతరం చేస్తామని నినదించాయి ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ జిందాల్ యాజమాన్యం నంద్యాల వెళ్ళమని చెబుతున్న వినటం లేదని ఇప్పటినుంచి చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి గడిపిములలో వాహనాలు రాకుండా కట్టడి చేస్తామని హామీ ఇచ్చారు ముస్లిం మైనార్టీ నాయకులు తాసిల్దార్ శ్రీనివాసులకు వినతిపత్రం ఇచ్చి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు అనంతరం జిందాల్ పరిశ్రమ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయకులు. జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్. ధనుంజయుడు. జిందాల్ ప్రతినిధులకు సమస్యను వెంటనే పరిష్కరించాలని వినతిపత్రం అందజేశాయి. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నుండి రామినేని రాజు నాయుడు. వనం వెంకటాద్రి. రాయలసీమ రవీంద్రనాథ్. బత్తిన ప్రతాప్. ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.