హెుళగుంద శ్రీమంతుడు టిడిపి ఎల్ఎల్సి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్
1 min read
పల్లెవెలుగు, హొళగుంద: తాను చదివిన పాఠశాల అభివృద్ధి కోసం… తాను పెరిగిన ప్రాంత అభివృద్ధి కోసం… తనతో పాటు కలిసి మెలిసి తిరిగిన ప్రజల మేలు కోసం నిరంతరం తపిస్తూ… సమాజ సేవకు చేయూతనందిస్తున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టిడిపి ఎల్ఎల్సి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాదరావు హెుళగుంద శ్రీమంతుడు అని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రం హెళగుంద లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజా పంపనగౌడ్, అబ్దుల్ సుభాన్, అలేఖ్య విజయ్ కుమార్, ముల్లా మోయిన్ మిక్కిలినేని శ్రీనివాసరావు, బహుజన టైమ్స్ దుర్గాప్రసాద్, ఎమ్మార్పీఎస్ వెంకటేష్ తదితరులు పాల్గొని మిగిలిన వెంకట శివప్రసాదరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మిక్కిలినేని ప్రసాద్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి ఉత్సాహంతులైన మిక్కిలినేని అభిమానులతో రక్తదానం చేయించి వారిని ప్రాణదాతలుగా మార్చారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు రాజా పంపన గౌడ్ మాట్లాడుతూ వ్యాపార రీత్యా హైదరాబాద్ నగరంలో స్థిరపడినప్పటికీ తాను చదువుకొని పెరిగిన ప్రాంతంపై మమకారంతో… సమాజసేవపై ఆసక్తితో… ప్రజాసేవ కోసం తాను ఎంచుకున్న రాజకీయ మార్గం ద్వారా ప్రజలకు ప్రత్యేకించి రైతులకు మంచి పనులు చేయడమే కాక ఎవరు ఊహించని విధంగా ఎప్పటికీ సాధ్యం కాదనుకున్న హాన్నూరు క్యాంపు తారు రోడ్డు సాధించడం మారుమూల ప్రాంత అభివృద్ధిపై మిక్కిలినేని ప్రసాద్ చూపిన శ్రద్ధకు నిదర్శనమని తెలిపారు. అదేవిధంగా టీబీపీ బోర్డు ఎల్ఎల్సిడిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్గా టీసీల అభివృద్ధి. నేటి వినియోగంలో రైతు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాడని తెలిపారు. తానుచదువుకున్న పాఠశాలలో విద్యార్థులు మరింత ప్రయోజన కారులుగా కావాలని కోరుకుంటూ తన కష్టార్జితంలో లక్షల రూపాయలను పాఠశాలలో వసతుల మెరుగునకు, విద్యార్థుల విద్యాభివృద్ధికి అందించిన నాయకుడు హులగుంద శ్రీమంతుడు మిక్కిలినేని వెంకట శివప్రసాద్ అని పేర్కొన్నారు. మిగిలిన ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని అదే సమయంలో మిక్కిలినేని అభిమానులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారడం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసినటువంటి వారికి ప్రశంసా పత్రాన్ని అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రైస్ మిల్ మురళీధర్, కాడప్ప, అబ్దుల్ సుభాన్, సిబిఎన్ ఆర్మీ ముల్లా మోయిన్, బాగోడి రాముడు, కొరివి సాయిబేష్, మార్లముడికి రమేష్ బుడగ జంగాల రామాంజనేయులు, కోగిల తోట హనుమంతు మార్లమడికి కల్లప్ప, లంకెప్ప, సినిమా మంగన్న, మంగలి వెంకటేష్ వరేలు శేఖర్, హాన్నూరు కొట్టాల ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మిక్కిలి నేని అభిమానులు పాల్గొన్నారు.