NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హెలీకాప్టర్ ప్రమాదం మాన‌వ త‌ప్పిదమే : చైనా వ్యాఖ్య‌

1 min read

పల్లెవెలుగు వెబ్​ :  చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ మ‌ర‌ణం పై చైనా కీల‌క వ్యాఖ్యలు చేసింది. భార‌త మిలట‌రీకి క్రమ‌శిక్షణ లేద‌ని, పోరాట సన్నద్ధత కూడా క‌రువేన‌ని వ్యాఖ్యానించింది. ప్రముఖ వార్తా సంస్థ గ్లోబ‌ల్ టైమ్స్ ఈ క‌థ‌నాన్ని ప్రచురించింది. భార‌త సైనిక బ‌ల‌గాలు ప్రామాణిక నిర్వహ‌ణ విధానాలు పాటించ‌ర‌ని, వారికి క్రమ‌శిక్షణ లేద‌ని అందులో పేర్కొంది. ఆర్మీ హెలీకాప్టర్ ప్రమాదం మాన‌వ‌ త‌ప్పిదం వ‌ల్లే జ‌రిగింద‌ని చైనా అభిప్రాయ‌ప‌డింది. గతంలోను భార‌త్ లో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయ‌ని తెలిపింది. వాతావ‌ర‌ణం మెరుగుప‌డే వ‌ర‌కు ప్రయాణాన్ని వాయిదా వేసినా.. పైలెట్ మ‌రింత నైపుణ్యవంతంగా న‌డిపినా.. క్షేత్రస్థాయిలో సిబ్బంది మ‌రిన్ని జాగ్రత్తలు తీసుకున్నా హెలికాప్టర్ ప్రమాదం జ‌రిగి ఉండేది కాద‌ని చైనా పేర్కొంది.

About Author