అంగారకుడిపై దిగిన హెలికాఫ్టర్
1 min readపల్లెవెలుగు వెబ్: అంగారకుడి పై విజయవంతంగా ఒక చిన్న హెలికాఫ్టర్ ను ఎగురవేసింది నాసా. ‘ఇంజన్యూటీ’ అనే డ్రోన్ ఒక నిమిషం కన్నా తక్కువసేపు గాల్లో ఎగిరింది. అంగారకుడి పై ఉన్న ఒక శాటిలైట్ ఈ సమాచారాన్ని నాసా శాస్త్రవేత్తలకు పంపింది. మానవులు మరో గ్రహం మీద రోటర్ క్రాఫ్ట్ నడిపారని చెప్పుకోవచ్చంటూ ఇంజన్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ మిమి ఆంగ్ తెలిపారు. మార్స్ వాతావరణానికి అనుగుణంగా ఇంజన్యూటీనీ అతి తక్కువ బరువుతో.. అత్యంత వేగంగా తిరిగే బ్లేడ్ తో రూపొందించారు. ఈ హెలికాఫ్టర్ 3 మీటర్ల ఎత్తున కొద్దిసేపు గాలిలో ఉండి ల్యాండ్ అయింది. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.