హలో బిసి… చలో తిరుపతి
1 min read– బిపి మండల్ డే
– జాతీయ బీసీ మహాసభను జయప్రదం చేసి బీసీల ఐక్యతను చాటాలి……
– ఏపీ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు వై నాగ శేషు పిలుపు..
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: బీసీల హక్కుల కోసం బీసీల ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ధి కోసం బీసీల రిజర్వేషన్ పితామహుడు బీపీ మండల్ జయంతి సందర్భంగా ఈనెల 7 అనగా సోమవారం ఓబీసీ జాతీయ మహాసభ తిరుపతి పట్టణంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిర్వహించబడుతుంది. జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేసి బీసీల ఐక్యతను చాటాలి.ఎందుకంటే రాష్ట్రంలో గాని దేశంలో గాని 60 శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం లేదంటే ఒకసారి మనము ఏ స్థితిలో ఉన్నాము ఆలోచించుకోవాలి.కాకి పిల్లకు దెబ్బ తగిలితే వేల కాకులు చుట్టుముడతాయి! మరి దేశాన్ని శాసించే జనాభా ఉన్న మనము ఎక్కడ వేసిన గొంగడి అక్కడ లాగానే ఉన్నాము! బూర్జువా పెత్తందారి రాజకీయ పార్టీల కొమ్ము కాస్తూ వారి జెండాలు మోస్తూ వారికి జై కొడుతూ సంక్షేమ పథకాల పేరుతో వారిని బిక్షం ఎత్తుకుంటున్నాం.కానీ ఆ సంక్షేమ పథకాలకు పెట్టే డబ్బు కూడా మనదని మర్చిపోతున్నాం.మన జాతిలో ఉన్న ఒక్కరు అమ్ముడుపోతే జాతీ మొత్తం అమ్ముడుపోయినట్టు ప్రచారం చేసుకుంటూ వారు రాజకీయ క్రీడ ఆడుతున్నారు.అందుకే బీసీ బహుజనలారా ఏకం కావాలి !పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప !అనే నినాదంతో ముందుకు సాగి చట్టసభల్లో రిజర్వేషన్లు మరియు ఓబిసి కుల జనగణ మరియు జనాభా దామాషా ప్రకారం పదవులు జనాభా శాతం బట్టి రిజర్వేషన్ సాధించుకొని రాజ్యాధికారం దిశగా ముందుకు సాగి పూలే, అంబేద్కర్, బీపీ మండల్, ఆశయాలను కొనసాగిద్దామని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు వై నాగ శేషు గారితో పాటు యువజన అధ్యక్షులు డేరంగుల పరమేష్ గారు సోషల్ మీడియా అధ్యక్షులు శ్రీనాథ్ గారు సోషల్ మీడియా టౌన్ అధ్యక్ తదితరులు పాల్గొన్నారు.