నాలుగేళ్ల పిల్లలకు హెల్మెట్ తప్పనిసరి !
1 min readపల్లెవెలుగువెబ్ : నాలుగేళ్ల లోపు పిల్లలను బైక్ పై తీసుకెళ్తే వారికి కూడ హెల్మెట్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే విధంగా బైక్ నడిపే వారికి, చిన్నారులకు మధ్య సేఫ్టీ హార్నెస్ ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పిల్లలతో బైక్ పై వెళ్తున్నప్పుడు 40 కేఎంపీహెచ్ కు మించరాదని నోటిఫికేషన్ లో పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి 1000 జరిమానాతో పాటు మూడు నెలల జైలు శిక్ష విధిస్తారని పేర్కొంది. 2022 ఫిబ్రవరి 15 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.