NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సాయం చేయండి మోదీ.. ఉక్రెయిన్ అభ్య‌ర్థన !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్ధానికి దిగిన నేప‌థ్యంలో ఉక్రెయిన్ భార‌త్ సాయాన్ని కోరింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌మ‌స్య ప‌రిష్కారానికి చొర‌వ తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడాలని ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసింది. మోదీ ప్రపంచంలోనే శక్తిమంతమైన నేత అని ఆయన మాట్లాడితే పుతిన్ వింటారని విశ్వాసం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌లో పరిస్థితి చేయిదాటిపోతోందని, మోదీ సాయం చేయాలని భారత్‌లో ఉక్రెయిన్ రాయబారి పొలిఖా కోరారు. ప్రపంచంలో శాంతి తీసుకొచ్చే సత్తా భారత్‌కే ఉందని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌లో 20 వేల మంది భారతీయ విద్యార్ధులున్నారని, వారిలో కొందరు యుద్ధం కారణంగా చిక్కుకుపోయారని పొలిఖా వెల్లడించారు.

                                 

About Author