ఆపదలో ఆదుకున్న హెల్ప్ సొసైటీ..
1 min readపల్లెవెలుగు , వెబ్ పత్తికొండ: ఆపదలో ఉన్న బాధితున్ని హెల్త్ సొసైటీ ఆర్థికంగా ఆదుకుంది. బతుకు తెరువు కోసం కడపకు వెళ్లి బేల్దారి పనిచేసుకుంటున్న వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. దీంతో బ్రతకడానికి ఎలాంటి ఆధారం ఆధారం లేకపోవడంతో హెల్ప్ యూత్ సొసైటీ మేమున్నామంటూ బాధితునికి ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. పత్తికొండ కు చెందిన గుండు ఫక్రుద్దీన్ బ్రతకడానికి కడప కు వెళ్లి బేల్దారి పనులు చేసుకుంటున్నాడు అనుకోని పరిస్థితుల రీత్యా ప్రమాదవశాత్తు మూడంతస్తుల పైనుండి కింద పడ్డాడు. రెండు కాళ్ళు పోగొట్టుకొని విగత జీవిగా మారాడు. కుటుంబ పోషణకు కష్టమైంది. స్థానిక హెల్ప్ యూత్ సొసైటీ వారి పరిస్థితిని గమనించి ఐదు వేల రూపాయలు బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. శుక్రవారం హెల్ప్ యూత్ సొసైటీ అధ్యక్షులు మీరా హుస్సేన్ సభ్యులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్.బి.కె ఫ్యాన్స్ అధ్యక్షులు సింగం శ్రీనివాసులు హెల్ప్ యూత్ సొసైటీ సభ్యులు రఫిక్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.