నిరుపేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి
1 min read– సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : సమాజంలో నిరాదరణకు గురవుతున్న వృద్దులు, నిరుపేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు సామాజిక సేవా దృక్పథంతో ముందుకు రావలసిన అవసరం ఉందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని బుధవారపేట లో ఉన్న ఆదరణ డే కేర్ సెంటర్ లోని నిరాశ్రయులకు సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదరణ డే కేర్ సెంటర్ నిర్వాహకుడు రంజిత్ తదితరులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ సమాజంలోని నిరుపేదలు, వృద్ధులు, నిరాశరాలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. సమాజంలో ముఖ్యంగా వృద్ధులకు సముచిత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికి ప్రభుత్వంతో పాటు సామాజిక సేవా దృక్పథం ఉన్నవారు నిరుపేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలని అన్నారు. సమాజంలో పేదరికం శాశ్వతంగా దూరం చేయడం సాధ్యం కాకపోవచ్చు కానీ ఉడతా భక్తిగా ఎంతోకొంత వారికి సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ సొంత లాభాన్ని కొంత మానుకొని ఇతరులకు సేవ చేసేందుకు ముందుకు రావాలని, అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి కొంతమంది సమాజంలోని వృద్ధులు, నిరుపేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. గతంలో కూడా ఆదరణ డే కేర్ సెంటర్ తో పాటు పలు అనాధ, వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించానని, భవిష్యత్తులో కూడా తన సహకారం ఉంటుందని ఆయన తెలిపారు .ఆదరణ డే కేర్ సెంటర్లోని వృద్ధులకు ఆరోగ్య సమస్యలు వస్తే వారికి సహాయం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు .ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని అప్పుడే దానికి సార్ధకత ఉంటుందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు.