NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీలో సినిమా టికెట్ ధ‌ర‌లు ఇవే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో సినిమా థియేట‌ర్ల టికెట్ ధ‌ర‌ల కొత్త జీవోని సోమవారం ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి ఏపీలో ఉన్న సమస్యల పరిష్కార నిమిత్తమై ఇటీవల సీఎం జగన్‌ను ఇండస్ట్రీ తరపు నుండి కొందరు పెద్దలు కలిసిన విషయం తెలిసిందే. ఆ భేటీ తర్వాత ఏపీలో టాలీవుడ్‌కి ఉన్న సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, ముఖ్యంగా సినిమా టికెట్ల ధరల విషయమై మరోమారు కమిటీతో చర్చలు జరిపి.. సరికొత్తగా జీవోని విడుదల చేయబోతున్నట్లుగా సినీ పెద్దలు ప్రకటించారు.

టికెట్ ధ‌ర‌ల విష‌యానికి వ‌స్తే..

  • మున్సిపల్ కార్పొరేషన్‌: నాన్ ఏసీ థియేటర్లలో రూ.60, రూ.40- ఏసీ థియేటర్లలో రూ.100, రూ.70- స్పెషల్ థియేటర్లలో రూ.125, రూ.100- మల్టీప్లెక్స్ రూ.150- రిక్లయినర్ రూ.250
  • మున్సిపాలిటీ: నాన్ ఏసీ థియేటర్లలో రూ.50, రూ.30- ఏసీ థియేటర్లలో రూ.80, రూ. 60- స్పెషల్ థియేటర్లలో రూ.100, రూ.80- మల్టీప్లెక్స్ రూ.125
  • నగర/గ్రామ పంచాయతీ: నాన్ ఏసీ థియేటర్లలో రూ.40, రూ.20- ఏసీ థియేటర్లలో రూ.70, రూ.50- స్పెషల్ థియేటర్లలో రూ.90, రూ.70- మల్టీప్లెక్స్ రూ.100

About Author