వంటనూనె ధరలు అమాంతం పెరగడానికి కారణాలు ఇవే !
1 min readపల్లెవెలుగు వెబ్ : దేశీయంగా వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. మధ్యతరగతి, సామాన్యు ప్రజలు కొని తినలేని పరిస్థితుల్లో నూనె ధరలు ఉన్నాయి. కరోన లాక్ డౌన్ ప్రారంభం నుంచి వంటనూనె ధరలు పరుగులు పెట్టాయని చెప్పవచ్చు. ప్రస్తుతం స్వల్పంగా తగ్గినప్పటికీ.. మునుపటి ధరల్లో మాత్రం లభ్యం కావడంలేదని చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక లీటర్ ఫ్రీడమ్ రిపైన్డ్ ఆయిల్ కరోన లాక్ డౌన్ కు ముందు 100 రూపాయాలు ఉంటే.. ప్రస్తుతం 135 నుంచి 145 వరకు ఉంది. ప్రధానంగా డిమాండ్ అధికంగా ఉండటం, సాగు స్వల్పంగా ఉండటమే ధరల పెరుగుదలకు కారణమైంది. పామాయిల్, సోయాబీన్ ఆయిల్ ఉత్పత్తి అధికంగా ఉన్న దేశాలు వాటిని బయోఫ్యూయల్ గా ఉపయోగించాలని నిర్ణయం తీసుకోవడం ధరల పెరుగుదలకు ప్రథమ కారణంగా చెప్పుకోవచ్చు. మలేషియా, ఇండోనేషియా దేశాల్లో పామాయిల్ తోటల సాగు ఎక్కువ. అలాగే అమెరికాలో సోయాబీన్ సాగు ఎక్కువ. ఈ దేశాలు పామాయిల్, సోయాబీన్ ఆయిల్ ను బయోఫ్యూయల్ ఉత్పత్తిలో వాడటం సప్లై తక్కువ కావడానికి కారణం. దీంతో భారత్ లో డిమాండ్ పెరిగింది. ఫలితంగా ధరలు పెరిగాయి. మరో ముఖ్య కారణం చైనా నుంచి అధిక మొత్తంలో నూనెలు కొనుగోలు చేయడం. ఫలితంగా వంటనూనె ధరలు సామాన్యుడికి అందనంత స్థాయిలో ఉన్నాయి.