మీ బ్యాంక్ అకౌంట్ సేఫ్ గా ఉండాలంటే ఇలా చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్: సైబర్ దాడుల భారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం..సైబర్ దాడుల నుంచి సురక్షితంగా ఉండేలా కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ముందస్తుగా సైబర్ నేరస్తులు బాధితుల బ్యాంక్ అకౌంట్లు, యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, ఓటీపీలను దొంగిలిస్తున్నారు. వాటి సాయంతో సేమ్ అఫిషియల్ బ్యాంక్ ఈమెల్ తరహాలో బ్యాంక్ హోల్డర్లకు జీమెయిల్ నుంచి ఈమెయిల్ సెండ్ చేస్తారు. బ్యాంక్ నుంచి వచ్చిన ఈమెయిల్స్ ఎలా స్పామ్ ఫోల్డర్లోకి వెళతాయో.. వీళ్లు పంపిన మెయిల్స్ సైతం అలాగే స్పామ్‌లోకి వెళతాయి. ఆ మెయిల్స్‌లో ఓ లింక్ క్లిక్ చేయాలని సూచిస్తారు. ఆ లింక్ క్లిక్ చేసి అందులో యూజర్ ఐడీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయమని అడుగుతారు. ఇలా చేయడానికి రివార్డ్ పాయింట్లను ఎరగా వేస్తారు.
సైబర్ దాడుల నుంచి సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి :
- ముందుగా మీ ఈ మెయిల్ లోని వెబ్సైట్ లింక్ (URL)ని తనిఖీ చేయండి. ఇది మీ బ్యాంక్ మాదిరిగానే ఉంటుంది, కానీ అది ఒకేలా ఉండదు.
- https: // లో ‘s’ ఉందో లేదో తనిఖీ చేయడం ద్వారా మీరు URL ని కూడా ధృవీకరించాలి. ఇది సురక్షితంగా ఉంటుంది.
- నకిలీ బ్యాంకులు లేదా కంపెనీలకు ఇది ఉండదు. నేరస్తులు (http: //) యూజ్ చేసే మెయిల్స్ ఇలా ఉంటాయి.
- మీకు అలాంటి ఫిషింగ్ ఈమెయిల్స్ వస్తే, లింక్‌లపై క్లిక్ చేయవద్దు
- ఏవైనా అనుమానాస్పద వెబ్సైట్లలో మీ యూజర్ నేమ్/పాస్‌వర్డ్‌ను ఎప్పుడూ అందించవద్దు.
- ఏ చట్టబద్ధమైన బ్యాంక్ లేదా కంపెనీ మీ పేరు/పాస్‌వర్డ్‌లను అడగదు. ఒకవేళ అడిగితే మిమ్మల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని గమనించాలి.