NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హీరో అబ్బాస్ .. ఇప్పడు ఏం చేస్తున్నాడో ..?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఒక‌ప్పటి అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు అబ్బాస్. త‌న స్టైలిష్ జుట్టుతో, స్కిన్ తో ఎంతో మంది అమ్మాయిల గుండెల్ని కొల్లగొట్టాడు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే 50 సినిమాల్లో న‌టించిన అబ్బాస్.. ఆ త‌ర్వాత సినీ ప‌రిశ్రమ‌కు దూర‌మ‌య్యారు. ఆ త‌ర్వాత ఏ సినిమాల్లోనూ అబ్బాస్ క‌నిపించ‌లేదు. అబ్బాస్ ఎక్కడున్నాడు.. ఏమ‌య్యాడో ఎవ‌రికీ తెలియ‌దు. ఆయ‌న సన్నిహితుల‌కు మాత్రమే అబ్బాస్ ఏం చేస్తున్నాడో తెలుసు. ప్రస్తుతం అబ్బాస్ న్యూజిలాండ్ లో ఉన్నాడు. పూర్తీగా అక్కడి పౌరుడిగా మారాడు. అక్కడి పౌర‌స‌త్వం తీసుకున్నారు. మోటివేష‌న‌ల్ స్పీక‌ర్ గా ఎంతో మంది యువ‌త‌లో ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. కొత్తగా న్యూజిలాండ్ వెళ్లిన స‌మయంలో చాలా క‌ష్టాలు ప‌డ్డట్టు ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. పెట్రోల్ బంకుల్లో కూడ ప‌ని చేసిన‌ట్టు ఆయ‌న చెప్పారు.

About Author