హీరో మాధవన్ తనయుడు అదరగొట్టాడు
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రముఖ హీరో మాధవన్ తనయుడు వేదాంత్ స్విమ్మింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. బెంగళూరులోని బసవగుడి అక్వాటిక్ సెంటర్లో జూనియర్ నేషనల్ స్విమ్మింగ్ అక్వాటిక్ చాంపియన్ షిప్ 2021 పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 16 ఏళ్ల వేదాంత్ సత్తా చాటాడు. ఏకంగా ఏడు మెడల్స్ సాధించాడు. వీటిలో 800 మీటర్ల ఫ్రీ స్టైల్, 1500 మీటర్ల ఫ్రీ స్టైల్, 4 100 ప్రీస్టైల్ రిలే, 4200 ప్రీ స్టైల్ రిలే రజత పతకాలు, 100, 200, 400 మీటర్ల ఫ్రీస్టైల్ పోటీల్లో కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఈ పోటీల్లో 7 కాంస్య పతకాలు గెలుచుకోవడం పట్ల కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ ట్వీట్ చేశారు. గుడ్ జాబ్ వేదాంత్. మీ ప్రదర్శన పట్ల గర్విస్తున్నాం
అని ట్వీట్ చేశారు.