PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీపీఐ నారాయ‌ణ‌కు హీరో నాగార్జున కౌంట‌ర్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇటీవల సీపీఐ నేత నారాయణ ఎంత మాత్రం గ్యాప్ లేకుండా బిగ్ బాస్ షో పైనా.. నాగార్జున పైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బిగ్ బాస్ షో వల్ల వల్ల సమాజానికి ఏం ఉపయోగం? మంచి వాళ్ళను చెడగొట్టడం తప్ప.. అంటూ ఇటు బిగ్ బాస్ షో పైనా మండిపడుతున్నారుు. అటు హోస్ట్ నాగార్జునపైనా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలకు.. బిగ్ బాస్ హౌస్ వేదికపైనే నాగార్జున కౌంటర్లు ిఇచ్చారు.. తాజాగా శనివారానికి సంబంధించి ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. అందులో నాగార్జన.. హౌస్ లో ఉన్న కపుల్ ను పిలుస్తారు. రోహిత్.. మెరీనాని టైట్ హగ్ చేసుకో అంటారు.. మీకు లైసెన్స్ ఉంది.. మీరు భార్య భర్తలు కౌగలించుకోవడం తప్పు కాదు అంటూ.. నారాయణ నారాయణ అంటూ కౌంటర్ వేశారు. భార్య భర్తలు కౌగలించుకోవడం తప్పుకాదని చెప్పండి అంటూ.. నారాయణపై సెటైర్లు వేశారు.

                                       

About Author