హీరోయిన్ అమలాపాల్ కు లైంగిక వేధింపులు !
1 min readపల్లెవెలుగువెబ్ : హీరోయిన్ అమలాపాల్ విల్లుపురం(తమిళనాడు) పోలీసులను ఆశ్రయించారు. మాజీ ప్రియుడు పవీందర్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు విడుదల చేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు పవీందర్తో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేసి, అతన్ని అరెస్ట్ చేశారు. మిగతా 11 మంది కోసం గాలింపు చేపట్టారు.