మాజీ మంత్రి పై హీరోయిన్ కేసు..!
1 min readపల్లెవెలుగు వెబ్: పెళ్లి పేరుతో మాజీ మంత్రి మణికంఠన్ తనను మోసం చేశాడని నటి చాందిని చెన్నై పోలీసు ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తనను ప్రేమించినట్టు.. పెళ్లి చేసుకుంటానని ఐదేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్నట్టు తెలిపారు. తాను గర్భం దాల్చగా.. తొలగించమని బలవంతం చేసి.. మూడు సార్లు గర్భం తొలగించాడని చెప్పింది. పెళ్లి చేసుకోమని తాను ఒత్తిడి తీసుకురావడంతో కిరాయి మనుషులతో తనను బెదిరించాడని ఆమె మీడియ ఎదుట చెప్పారు. తనకు, తన కుటంబ సభ్యులకు మణికంఠ నుంచి ప్రాణహాని ఉందని ఆమె తెలిపారు. ఆయన మీద చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.