NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హీరోయిన్ క్యాస్ట్ స‌ర్టిఫికెట్ ర‌ద్దు..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: న‌వ‌నీత్ కౌర్ … ఒక‌ప్పుడు తెలుగులో వెలుగు వెలిగిన హీరోయిన్. సినిమాల్లో నుంచి నేరుగా ఆమె మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2014లో పోటీ చేసి ఓడిపోయిన‌ప్పటికీ.. 2019లో మ‌హారాష్ట్రలోని అమ‌రావ‌తి నుంచి స్వతంత్ర ఎంపీగా గెలిచారు. పార్లమెంటులో కూడ త‌న‌దైన శైలిలో వాగ్భాణాలు సంధించారు. ఇప్పడు ఎంపీ న‌వ‌నీత్ కౌర్ కు పెద్ద క‌ష్టమే వ‌చ్చింది. అమ‌రావ‌తి పార్లమెంట్ స్థానం ఎస్సీ రిజ‌ర్వుడ్. ఆమె త‌ప్పుడు ఎస్సీ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించి ఎన్నిక‌ల్లో పోటీ చేసింద‌ని శివ‌సేన నేత‌లు బాంబే హైకోర్టులో స‌వాల్ చేశారు. విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం న‌వ‌నీత్ కౌర్ త‌ప్పుడు ఎస్సీ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించింద‌ని తేల్చింది. ఆమెకు 2 ల‌క్షల ఫైన్ కూడ వేసింది. దీంతో ఆమె ఎంపీ స్థానానికి కూడ ముప్పు వ‌చ్చింది.

About Author