NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హీరోయిన్ హంసానందినికి క్యాన్స‌ర్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ హీరోయిన్ హంసానందిని క్యాన్స‌ర్ బారిన ప‌డ్డారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదిక‌గా ఆమె ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. గ‌త కొంతకాలంగా ఆమె సినిమాల‌కు, సోష‌ల్ మీడియాకు దూరంగా ఉన్నారు. ప్ర‌స్తుతం తాను క్యాన్స‌ర్ పై పోరాటం చేస్తున్నాన‌ని, త్వ‌ర‌లో సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు. గ‌తంలో రొమ్ము క్యాన్స‌ర్ బారిన ప‌డ‌టంతో స‌ర్జ‌రీ చేసి తొల‌గించార‌ని, అయితే త‌న‌కు జ‌న్యుప‌ర‌మైన క్యాన్స‌ర్ ఉంద‌ని తాజాగా ప‌రీక్ష‌ల్లో నిర్దార‌ణ అయిన‌ట్టు ఆమె తెలిపారు. ప్ర‌స్తుతం చికిత్స తీసుకుంటున్న‌ట్టు వెల్ల‌డించారు. భాదితురాలిగా ఉండ‌కుండా క్యాన్స‌ర్ తో పోరాడి సంపూర్ణ ఆరోగ్యంతో బ‌య‌ట‌కి వ‌స్తాన‌ని తెలిపారు.

                                
  

About Author