సీఎం జగన్ ఇంటి వద్ద హై అలర్ట్ !
1 min read
పల్లెవెలుగు వెబ్ : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. రాజధాని రైతుల ఉద్యమం 550 రోజులు పూర్తైన సందర్భంగా జగన్ ఇంటిని రైతులు ముట్టడిస్తారన్న సమాచారంతో హై అలర్ట్ ప్రకటించారు. ముందస్తు సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయానికి చేరే మార్గాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం క్యాంపు కార్యాలయం పరిసర ప్రాంతాల్లో కొత్తవారికి ఆశ్రయమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పరిసర ప్రాంత ప్రజల్ని పోలీసులు హెచ్చరించారు. రైతుల ర్యాలీలు, నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు.