ఉపాధి బిల్లుల చెల్లింపు పై హైకోర్టు అసహనం
1 min readపల్లెవెలుగు వెబ్ : ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పదేపదే హామీ ఇచ్చి బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించింది. ఆగస్టు 1లోపు ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆదేశించింది. లేకపోతే పంచాయతీరాజ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు హైకోర్టులో హాజరుకావాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. విచారణను ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేసింది.