హైకోర్టు.. న్యాయమూర్తిగా స్వలింగ సంపర్కుడు !
1 min readపల్లెవెలుగు వెబ్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ నేతృత్వంలోని కొలీజియం నియామక సిఫార్సు రికార్డు సృష్టించింది. బహిరంగంగా స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్న న్యాయవాది సౌరభ్ కిర్ పాల్ ను.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సిఫారసు చేసింది. ఈ సిఫార్సులను ఆమోదించి కేంద్రం ఆమోద ముద్ర వేస్తే తొలి స్వలింగ సంపర్క న్యాయమూర్తిగా ఆయన రికార్డులకెక్కుతారు. ఆయన పేరును కొలీజియం ఇప్పటికే మూడు , నాలుగు సార్లు సిఫారసు చేసింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఆయన లైంగిక అలవాట్లను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేస్తూ వస్తున్నారన్న భావన న్యాయవాద వర్గాల్లో ఉంది. అయితే ఆయన జీవిత భాగస్వామి విదేశీయులని, స్విస్ రాయబార కార్యాలయంలో పనిచేస్తారని, ఆయనను న్యాయమూర్తిగా నియమిస్తే దేశభద్రతకు ముప్పువాటిల్లుతుందని కేంద్ర ఇంటిలిజెన్స్ బ్యూరో కొలీజియంకు గతంలో సిఫారసు చేసింది. అయితే.. ఈ విషయాలన్నింటినీ కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందా.. లేదా అన్నది వేచిచూడాలి.