PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హైకోర్టులో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ హైకోర్టు పలు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారానే మొత్తం 158 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను జిల్లా కోర్డుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించనున్నారు. అయితే ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుంది. వీటికి దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 22 నుంచి ప్రారభం కాగా.. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 11 వరకు ఉంది. అంటే మరో మూడు రోజుల్లో ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అబ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. అనంతపురం వాసులకు తెలుగు, కన్నడ భాష వచ్చి ఉండాలి. శ్రీకాకులం, విజయనగం జిల్లా అభ్యర్థులకు తెలుగు, ఒరియా వచ్చి ఉండాలి.

అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.800 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి. ఎంపికైన వారికి నెలకు రూ.23,780ల నుంచి రూ.76,730ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆన్ లైన్ విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల్లో మొత్తం 80 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. వీటిలొ మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు తదుపరి దశకు పిలుస్తారు. ఈ రాత పరీక్షలో కనీసం 40 శాతం మార్కులు సాధించిన వారు అర్హత సాధిస్తారు. ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్ధులు 30 శాతం మార్కులు సాధిస్తే చాలు. దరఖాస్తుల సమయంలో ఏమైనా సందేహాలు ఉంటే.. 0863-2372752 నంబర్ కు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ మెయిల్ ఐడీ [email protected] కూడా సంప్రదించవచ్చు.

About Author