తితిదే బోర్డు సభ్యులకు హైకోర్టు నోటీసులు! నియామక షిటీషన్పై విచారణ
1 min readపల్లెవెలుగువెబ్, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవోనెం.245 ద్వారా 25మందితో కూడిన నూతన తితిదే బోర్డును నియమించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో బోర్డు సభ్యుల్లో 14మందిపై నేరారోపణలు ఉన్నాయని, అలాగే మరో నగురులు రాజకీయ నేపథ్యం కలిగిన వారు ఉన్నారని అంశంపై బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తితిదే ధర్మకర్తల నియామకం కాస్త వివాదాస్పదమయింది. ఈమేరకు బుధవారం హైకోర్టు సదరు పీటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈమేరకు పిటిషనర్ తరపు న్యాయవాధి తన వాదలను వినిపిస్తూ సదరు 18మంది సభ్యులను ఇంప్లీడ్ చేయాలని కోరారు. ఈమేరకు పరిశీలించిన హైకోర్టు పిటిషనర్ అభ్యంతరాలను ఏకీభవించి సదరు 18మంది బోర్డు సభ్యులకు నోటీసులు జారీ చేసింది. అయితే తదుపరి విచారణను దసరా సెలవుల అనంతరానికి వాయిదా వేసింది.