RRR అరెస్టు పై హైకోర్టుకు…
1 min readపల్లెవెలుగు వెబ్: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టును ఏపీ సీఐడీ అధికారులు ధృవీకరించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారనే ఆరోపణతో ఆయనను అరెస్టు చేశారు. అయితే రఘురామకృష్ణరాజు అరెస్టు మీద ఆయన న్యాయవాదులు హైకోర్టుకెళ్లారు. నిబంధనల ప్రకారం ఎంపీని అరెస్టు చేయలేదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ మీద ఈరోజు మధ్యాహ్నం వాదనలు జరగనున్నాయి. రఘురామకు అనారోగ్య సమస్యలున్నాయని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. విచారణ పూర్తయ్యే వరకు మెజీస్ట్రేట్ ఎదుట హాజరుపరచొద్దని హైకోర్టు సూచించింది. రఘురామకు అన్నిరకాల సదుపాయాలు కల్పించాలని సీఐడీకి హైకోర్టు నిర్దేశించింది.