ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్..!
1 min read
పల్లెవెలుగు వెబ్: అమరరాజ బ్యాటరీస్ సంస్థకు హైకోర్టులో ఊరట లభించింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సూచనలు అమలు చేయాలని ఆదేశించింది. జూన్ 17లోపు పీసీబీ సూచనలు అమలు చేయాలని చెప్పింది. జూన్ 17 తర్వాత అమరరాజ బ్యాటరీస్ లో మరోసారి తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని పీసీబీకి హైకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల చిత్తూరు జిల్లాలోని అమరరాజ బ్యాటరీస్ సంస్థను మూసివేయాలని పొల్యూషన్ కంట్రల్ బోర్డు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అమరరాజ బ్యాటరీస్ యాజమాన్యం హైకోర్టు కు వెళ్లింది. అమరరాజ బ్యాటరీస్ తెలుగు దేశం ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులకు చెందినది.