PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తితిదే పాలకవర్గంలో ఏపీప్రభుత్వానికి హైకోర్టు షాక్​!

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి పాలకవర్గంలో నియమించిన ప్రత్యేక ఆహ్వానితులు ఎందుకని, సదరు నియామక జీవోను హైకోర్టు బుధవారం జరిపిన విచారణలో సస్పెండ్​ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15న తితిదే పాలకవర్గం నియామక ప్రక్రియలో జీవోనెం.245 ప్రకారం 25మందితోకూడిన పాలకవర్గాన్ని నియమించిన విషయం తెలిసిందే. అలాగే జీవోనెం.568కింద మరో 50మందిని పాలకవర్గంలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. ఈక్రమంలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై బీజేపీ, టీడీపీలు సవాల్​ చేస్తూ హైకోర్టు వెళ్లాయి. దీంతో బుధవారం ఈ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు సదరు జీవోను సస్పండ్​ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీంతో హైకోర్టు తితిదే పాలకవర్గ నియామక తీరుపై ప్రభుత్వానికి షాకిచ్చినట్లయింది.

About Author