PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ ప్రమాణస్వీకారం పై హైకోర్టు స్టే

1 min read

పల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లా శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ ప్రమాణ స్వీకారం పై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ట్రస్ట్ బోర్డ్ నియామకాన్ని సవాల్ చేస్తూ కొర్రా శ్రీనివాసులు నాయక్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్టు బోర్డు ఏర్పాటులో నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ట్రైబల్ చరిత్ర కలిగిన దేవాలయంలో గిరిజనులకు ప్రాతినిధ్యం లేకపోవడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఇద్దరు హిందూ ధార్మిక తాత్వికవేత్తలు ఉండాలని, కానీ ట్రస్టు బోర్డులో లేరన్నారు. ఆలయంపై అవగాహన లేనివారు సభ్యులుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాదనలు విన్న అనంతరం బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం పై హైకోర్టు స్టే విధించింది.

           

About Author