గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కేసులో హైకోర్టు కీలక తీర్పు !
1 min readపల్లెవెలుగువెబ్ : మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడినట్టుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు చెందినదిగా చెబుతున్న వీడియో వ్యవహారంపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో ఇకపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఆర్డర్ జారీ చేసింది. తనదిగా చెబుతూ ఓ మార్ఫింగ్ వీడియోతో తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ గోరంట్ల మాధవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ అధికారులు ఓ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పలువురు టీడీపీ నేతల పేర్లను సీఐడీ అధికారులు చేర్చారు.