హైకోర్టు వార్నింగ్…ఇప్పుడు ఏంచేస్తారు?
1 min readపల్లెవెలుగు వెబ్ : కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ పై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు హెచ్చరిక చేసింది. 48 గంటల్లోగా నిర్ణయం తీసుకోకుంటే తామే ఆదేశాలిస్తామని హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, హెల్త్ డైరెక్టర్ ను ఆదేశించిన కోర్టు.. రాష్ట్ర సరిహద్దుల్లోనూ టెస్టులు చేయాలని సూచించింది. 22న స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశిస్తూ.. అనంతరం విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.