పుస్తక పఠనం ద్వారానే ఉన్నత శిఖరాలు: కలెక్టర్ కార్తికేయ మిశ్రా
1 min readపల్లెవెలుగు వెబ్, ఏలూరు: జిల్లాలోని నరసింహారావు పేట జిల్లా కేంద్ర గ్రంధాలయలో54వ గ్రంథాలయ వారోత్సవాల సభ వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ముందుగా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా జోహార్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి విద్యార్థులు ఆధునికంగా వెలువడిన టెక్నాలజీ ని ఉపయోగిస్తూ పుస్తక పఠనానికి దూరమయ్యారని అన్నారు,నూతన ఒరవడిలో ఆధునిక టెక్నాలజీ తో ఎన్ని వచ్చినా పుస్తక పఠనం ముఖ్యమైనదని విద్యార్థులకు వివరించారు,కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని గ్రంథాలయాలకు రావటం, చదవటం అలవర్చుకోవాలన్నరు.
డీఈవో సివి రేణుక మాట్లాడుతూ విద్యార్థులు ముఖ్యంగా సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలని, టీవీ చూడటం,సీరియల్స్ లో నిమగ్నం అవ్వటం సరైన పద్ధతి కాదని సమీపంలో ఏ పుస్తకం కనిపించినా ఆ పుస్తకాన్ని చదవటం అలవర్చుకోవాలని, అన్ని పాఠశాలల్లో (రీడింగ్ రూమ్స్) గ్రంథాలయాలు ఏర్పాటు చేశామని విద్యార్థులు కొంత సమయాన్ని కేటాయించి చదివే వైపు దృష్టిని మళ్లించాలని సూచించారు,ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావు, జిల్లా రెవెన్యూ అధికారి వి డేవిడ్ రాజు,జిల్లా రిజిస్ర్టార్ లంక వెంకటేశ్వర్లు, కార్యదర్శి,పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ వి రవికుమార్,రిటైర్డ్ ప్రొఫెసర్ సిఆర్ ఆర్ కళాశాల ఎల్ వెంకటేశ్వర్లు,రిటైర్డ్ దేవదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అనంతరం గ్రంథాలయ లో చదివిన విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిర పడిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించి వారికి శాలువాలు కప్పి అధికారులు మరియు కార్యదర్శి వి రవికుమార్ సన్మానించారు.