NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అధిక ధరలతో సామాన్యుడు కుదేలు…

1 min read

పాణ్యం టిడిపి అభ్యర్థి గౌరు చరిత రెడ్డి..

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం కరిమద్ధేల గ్రామంలో బుధవారం  నాడు “బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ” కార్యక్రమం లో భాగంగా   ‘బాబు సూపర్ సిక్స్ డోర్ టు డోర్’ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి టిడిపి ప్రభుత్వం వస్తే అమలు చేసే పథకాలను  ఎమ్మెల్యే పాణ్యo టిడిపి ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి శ్రీమతి గౌరు చరిత రెడ్డి  వివరించారు గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల పాలనలో అధిక ధరలతో సామాన్యుడి నడ్డి విరిచారని విద్యుత్ ఛార్జీలు గ్యాస్ కూరగాయలు ఇసుక అన్ని అందకుండా చేశారని ఆరోపించారు  ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సైకిల్ గుర్తుకు ఓటు వేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజల సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం పై ప్రజలు విసుగు చెందినారని ఉపాధి పరిశ్రమంలో స్థానికులకి 70% ఉద్యోగాలు అని మోసం చేశారని యువత ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు .ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణ రెడ్డి, కరిమద్ధేల ఈశ్వర్ రెడ్డి,శివారెడ్డి, సేగిరెడ్డి చంద్రారెడ్డి,భూపాల్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, రమణయ్య వెంకటకృష్ణ,మంగలి శీను, పశువుల శివరాముడు,మండల నాయకులు సీత రామీ రెడ్డి, మంచాల కట్ట మురళి రెడ్డి,బుజునూరు పంట రామచంద్రారెడ్డి,బోల్లరo సుభద్రమ్మ,పేసరవాయి లక్ష్మి దేవి, దుర్వేసి కిట్టు యాదవ్, శ్రీనివాసులు యాదవ్, , తిరుపాడు గిరి,బిలకల గూడూరు సుదర్శన్ రెడ్డి,,టీడీపీ,జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author